యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ఫ్యాన్స్‌కు బిగ్ సర్‌ప్రైజ్. ‘మహానటి’తో జాతీయ అవార్డును దక్కించుకున్న నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ప్రభాస్ తన 21వ చిత్రం చేయబోతున్నాడు. వైజయంతి మూవీస్ సంస్థ 50 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించింది. ఈ సినిమాను వైజయంతి మూవీస్ అధినేత అశ్వినీదత్ నిర్మించనున్నారు. ‘వైజయంతి మూవీస్ పతాకంపై నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ప్రతిష్టాత్మకంగా ప్రభాస్ చిత్రాన్ని తెరకెక్కించనున్నామని చెప్పడానికి గర్విస్తున్నాం’అంటూ ఆ సంస్థ ట్వీట్ చేసింది. అయితే ఈ సినిమా టైటిల్, కథ, తారాగణం, సాంకేతిక నిపుణుల వివరాల గురించి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. చిత్రానికి సంబంధించిన పూర్తి వివరాలు త్వరలో వెల్లడించనున్నారు.
నాగ్ అశ్విన్‌తో ప్రభాస్.. ఇది ఫిక్స్