కరోనా: ఈ బేబీ సూపర్‌ హీరో!

హిందీ ప్రముఖ సీరియల్‌ ‘బాలిక వధూ’ నటుడు రుస్లాన్‌ ముంతాజ్‌ తండ్రి అయ్యాడు. ఆయన భార్య నిరాలి మెహతా గురువారం(మార్చి 26) మగ బిడ్డకు జన్మినిచ్చారు. ఈ విషయాన్ని ముంతాజ్‌ సోషల్‌ మీడియాలో శుక్రవారం ప్రకటించాడు. తాను తండ్రినయ్యాను అంటూ భావోద్యేగ పోస్టును ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకున్నాడు.‘అసలైతే అప్పుడే పుట్టిన బిడ్డల ఫొటోలు తీయడం కానీ బయటకు చూపించడం కానీ చేయొద్దంటారు. కానీ నా మనస్సు అత్యుత్సాహంతో ఉంది. అందుకే ఆగలేక నా కొడుకు ఫొటోలను వెంటనే షేర్‌ చేయకుండా ఉండలేకపోతున్నాను. మా ఇంటికి చోటా బేజీ వచ్చేసాడు. 3,4 నెలల తర్వాత అప్‌లోడ్‌ చేయాల్సిన నా బేబీ ఫొటోలను ఇప్పుడే షేర్‌ చేస్తున్నాను. ప్రస్తుతం కరోనా వైరస్‌ మహమ్మారితో ప్రపంచం ఎదుర్కొంటున్న గడ్డు సమయంలో ఈ వార్త మీకు కాస్తా ఆనందాన్నిస్తుందని నమ్ముతున్నాను’ అంటూ ఇన్‌స్టాలో రాసుకొచ్చాడు. (లాక్‌డౌన్‌: స‌ల్మాన్ ఏం చేస్తున్నాడో తెలుసా!)