తిరువనంతపురం : ఆల్కహాల్ అనుకుని శానిటైజర్ తాగిన ఓ ఖైదీ శుక్రవారం మృతి చెందాడు. ఈ ఘటన కేరళలోని పాలక్కాడ్‌లో చోటుచేసుకుంది. రామన్ కుట్టి అనే వ్యక్తి ఫిబ్రవరి 18 నుంచి రిమాండ్ ఖైదీగా జైలులో శిక్ష అనుభవిస్తున్నాడు. ఈ క్రమంలో గురువారం రామన్ కుట్టి కళ్లు తిరిగి పడిపోవడంతో జైలు అధికారులు అతనిని ఆసుపత్రిలో చేర్పించారు. దీంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. రాష్ట్ర ప్రభుత్వ సూచనల మేరకు జైలులో ఖైదీల చేత శానిటైజర్ తయారు చేయిస్తారు. ఈ నేపథ్యంలో గత గురువారం రామన్ కుట్టి ఆల్కహాల్ అనుకొని శానిటైజర్ తాగుంటాడని జైలు అధికారులు భావిస్తున్నారు. అయితే మంగళవారం రాత్రి వరకు అతని ఆరోగ్యం సాధారణ స్థితిలోనే ఉందని, బుధవారం రోల్ కాల్ కోసం కూడా హాజరయ్యాడని పేర్కొన్నారు.
శానిటైజర్‌ను ఆల్కహాల్ అనుకుని తాగి..